దర్శి పట్టణంలోని 10వ వార్డు ఎల్‌పి రోడ్‌లో రూ.21 లక్షలతో నిర్మిస్తున్న నూతన డ్రైన్స్‌కు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు డా కడియాల లలిత్ సాగర్ గారు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని తెలిపారు. దర్శి పట్టణం మరియు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఇప్పటికే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, అదే స్ఫూర్తితో దర్శిలో కూడా అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ప్రాంతానికి అభివృద్ధి అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చాo

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *