అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి సౌజన్యంతో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని దేవాంగ నగర్‌లో జీవ వైవిధ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రకృతిలో జీవ జాతుల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ అవసరం, పక్షులు మరియు జంతువుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.వేసవి కాలంలో పక్షులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కార్యక్రమంలో భాగంగా పక్షుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి ముందర పైన నీటి పాత్రలు ఉంచి పక్షులను కాపాడాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ జీవ వైవిధ్యం పరిరక్షణతోనే భూమిపై జీవరాశుల సమతుల్యత కొనసాగుతుందని తెలిపారు.మొక్కలు నాటడం,నీటి వనరులను కాపాడడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చని పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక యువకులు, మహిళలు,విద్యార్థులు పాల్గొని పక్షులకు నీటి పాత్రలు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *