కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పామూరు బస్టాండ్ వద్ద ఒంటరిగా ప్రయాణించే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారికి మాయ మాటలు చెప్పి వాళ్లు వెళ్లవలసిన ఊరికే నేరస్తులు కూడా వెళుతున్నామని నమ్మించి వృద్ధులను కారులో ఎక్కించుకొని వారిని కత్తితో బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న బంగారం,డబ్బులు లాక్కొని వారిని ఏకాంత ప్రదేశంలో దింపేసి వెళ్లిపోయే ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు సవర్ల బంగారు ఉంగరాలను రికవరీ చేసినట్లుగా మరియు నేరానికి ఉపయోగించిన కారును మరియు కత్తిని సీజ్ చేసినట్లుగా కందుకూరు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు గారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా గాని గుర్తుతెలియని వ్యక్తులు తమ కారులో వదిలిపెడతామని మాయ మాటలు చెపితే వారిని నమ్మవద్దని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *