25-05-2026 సోమవారం ఉదయం 08:30 కు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ వేలంకేంద్రం సందర్శన
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గంలోని పొగాకు వేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు తీసుకువచ్చిన బేళ్లను మంచి రేటు కొనుగోలు చేయాలని కోరుతూ ఉదయం 08:30 గంటలకు పామూరు రోడ్ లోని 27వ వేలం పొగాకు వేలం కేంద్రాన్ని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ సందర్శించనున్నారు. పొగాకు బేళ్ళు కొనుగోలు లేక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయ్యింది వేలం కేంద్రానికి వ్యయ ప్రయాసలకోర్చి రైతు పొగాకు బేళ్లను తీసుకువెళ్లిన గిట్టుబాటు ధర లేక వచ్చిందే ఆదాయమని తెగనమ్ముకోవాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలంలో జోక్యం చేసుకొని మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు బేళ్లను కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. రేపు ఉదయం జరిగే పొగాకు వేలం కేంద్ర సందర్శనను పార్టీ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నారు.