తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ ఒంగోలు టిడిపి కార్యాలయంలో ప్రకాశం జిల్లా తెలుగు మహిళల ఆధ్వర్యంలో స్త్రీశక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తెలుగు మహిళలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు ,దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు , రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్విని గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర గారు , మహిళా నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు.గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ “మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తానని నారా లోకేష్ గారు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తూ మహిళలకు రాజకీయ భరోసా కల్పిస్తోంది” అని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *