google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచడం, ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా వై.పాలెం సీఐ గారు మరియు దోర్నాల ఎస్సై గారు దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డును పరిశీలించారు.ఈ సందర్భంగా ఘాట్ రోడ్డులో మలుపులు అధికంగా ఉండే ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, వాహనదారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందించేందుకు ఏర్పాటు చేసిన కన్వెక్స్ మిర్రర్ల వద్ద మార్కాపురం జిల్లా పోలీసుల హెచ్చరిక మరియు భద్రతా సూచనల బోర్డులను ఏర్పాటు చేశారు.ఘాట్ రోడ్లలో వాహనదారులు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మలుపుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.ప్రజల ప్రాణాలు అమూల్యమైనవని, ముఖ్యంగా దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *