ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళల భద్రత, సాధికారత మరియు మహిళలపై జరిగే నేరాల నివారణ లక్ష్యంగా సంతమాగులూరు సీఐ గారి ఆధ్వర్యంలో, సంతమాగులూరు ఎస్సైతో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది మరియు స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలపై జరిగే నేరాల నివారణ, చట్టపరమైన రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పోలీసు సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా శక్తి యాప్ (Shakthi App) వినియోగం, దాని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం ఎలా పొందవచ్చో వివరించారు.అదేవిధంగా సైబర్ మోసాలు, సోషల్ మీడియా వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్, గృహ హింస వంటి అంశాలపై అవగాహన కల్పించి, మహిళలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.మహిళల భద్రతకు ప్రకాశం జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి మహిళ తన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, సురక్షిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *