తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లలో పోలీసులు భారీగా చర్యలు చేపట్టారు.
33 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నేరస్తులను అదుపులోకి తీసుకుని, వారికి సంబంధించి చలానాలు విధించారు. ఒకొక్కరిపై సుమారు ₹10,000 వరకు జరిమానాలు విధించినట్టు ట్రాఫిక్ సీఐ జగదీష్ గారు తెలిపారు..
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠినతర చర్యలు చేపడుతున్నారు.
మద్యం సేవించి వాహనం నడిపితే చిన్నపాటి నిర్లక్ష్యంతోనే పెద్ద ప్రమాదాలు జరుగుతాయని
నియమాలను పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించుకోవాలని
హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని, రోడ్డుప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజల భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.