తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండలోని డాక్టర్ ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, “ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం” అనే శీర్షికతో రూపొందించిన పోస్టర్‌ను మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేస్తోందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, టౌన్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.