మంత్రి గొట్టిపాటి, CMD పుల్లారెడ్డి గార్లతో చర్చలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి ముందడుగు వేస్తున్నారు.విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, APCPDCL CMD పుల్లారెడ్డి గార్లను ఈరోజు విజయవాడలో కలిసి పలు అంశాలపై చర్చించడంతోపాటు వినతిపత్రం అందించారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని… కందుకూరు పట్టణం, పలుకూరు (కందుకూరు మండలం), చేవూరు (గుడ్లూరు మండలం), వెంగళాపురం (లింగసముద్రం మండలం) గ్రామాల పరిధిలో కొత్తగా 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDS పథకంలో భాగంగా…. కందుకూరు పట్టణంలో హైమాస్ట్ పోల్స్ (ఎత్తు స్తంభాలు) ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని… పలు మండలాల్లో కొత్తగా ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతూ.. అందుకు సంబంధించిన వివరాలతో వినతి పత్రం ఇచ్చారు.
MLA నాగేశ్వరరావు గారి విజ్ఞప్తితో CMD పుల్లారెడ్డి గారు సానుకూలంగా స్పందించి… రెండు మూడు నెలల్లో అవన్నీ కచ్చితంగా మంజూరు చేస్తామని తెలిపారు.