తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని చెరువుకొమ్ముపాలెంలో గురువారం తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు దగ్గరలోని నీటి కుంట వద్దకు ఈతకు వెళ్లి నీటిలో ఊపిరాడక చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాలూకా సీఐ విజయ్ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన చిన్నారులు కరాటే అభిరామ్ (14), కరేడు సుశాంత్ (12), పొదిలి చిన్ను (11), దినేష్ (10) గా పోలీస్ లు గుర్తించారు…_