పెండింగ్‌లో ఉన్న UI (Undetected/Under Investigation) కేసుల త్వరిత పరిష్కారం మరియు కేసుల ఛేదన శాతాన్ని పెంచడమే లక్ష్యంగా దర్శి డీఎస్పీ గారు అద్దంకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులను పరిశీలించి, వాటిని విభజించి (Segregation) కేసుల వారీగా సమగ్ర సమీక్ష చేపట్టారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించి, వచ్చే వారం రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేసి కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, నిందితుల గుర్తింపు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించి, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని డీఎస్పీ గారు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *