తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
కురిచేడు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు దర్శి తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గార్లతో కలిసి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కురిచేడు ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, అసిస్ట్ సేవా సంస్థ ప్రతినిధులు, మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నేమిలయ్య గారు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు నాగరాజు గారు, పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డం బాలయ్య గారు, నీటి సంఘం డీసీ ఉన్నగిరి కోటేశ్వరరావు గారు, మేడగం నాగేశ్వరరావు గారు, క్లస్టర్ వెంకటేశ్వర్లు గారు, మండల ఐటీడీపీ అధ్యక్షులు కాళ్ల వెంకటేశ్వర్లు గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కేశనపల్లి సువయ్య గారు, కిలారి కొండయ్య గారు, గొట్టిపాటి వెంకటేశ్వర్లు గారు, మొగల్ మస్తాన్ వలి గారు, ఆదినారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.అలాగే కురిచేడు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.