తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

పర్యావరణ పరిరక్షణే మన సంస్కృతిలో భాగంగా ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి పరిరక్షించాలని సన్నెబొయిన శ్రీనివాసులు చైర్మన్ ధర్మకర్తలి మండలి కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శుక్ర‌వారం సన్నెబొయిన శ్రీనివాసులు చైర్మన్ ధర్మకర్తల మండలి మరియు ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంపొందిస్తూ కాలుష్యాన్ని తగ్గించడంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ,చెట్లు ప్రాణ వాయువును అందించడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, భూగర్భ జలాల సంరక్షణకు దోహద పడతాయని పేర్కొన్నారు. వర్షపాతం పెరగడానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భావితరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చక ఉదయగిరి వెంకట శేష లక్ష్మీ నరసింహ చార్యులు, అర్చక ఉదయగిరి లక్ష్మీ నరసింహచార్యులు ,రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *