వివిధ శాఖల అధికారుల తో ధర్మకర్తల మండలి సమీక్ష.
భక్తుల సౌకర్యం మౌలిక సదుపాయాలు కల్పన శాంతి భద్రతల పై ప్రత్యేక దృష్టి.
బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు భక్తులు, నిర్వాహకులు, సహకరించాలి.
ధర్మకర్తల మండలి సమన్వయ సమావేశం లో చర్చించిన అధికారులు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
భక్తుల కొంగు బంగారు యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మి నారసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుండి జూలై 5 వరకు నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మ కర్తల మండలి, చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు శనివారం ఆలయం లోని తన ఛాంబర్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ
రెవెన్యూ , పోలీస్, మండల పరిషత్, వైద్య ఆరోగ్య,విద్యుత్ శాఖ ల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం లో కొలువు దీరిన లక్ష్మి నారసింహ స్వామి ఈ ప్రాంత ప్రజలకు కొంగుబంగారు గా భక్తులు విశ్వాసంతో ఉంటారు. ఈ ప్రాంతం లో జరిగే నారసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా శాంతి భద్రతల సమస్య లు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయం సహకారం తో నిర్వహించాలని కోరారు. ప్రత్యేకించి పారిశుధ్యం, మరుగుదొడ్లు, వైద్య ఆరోగ్యం, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు కల్పించడం లో ప్రతి శాఖ తమ సహకారం అందించాలని చైర్మన్ కోరారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు, ప్రజలు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ ధర్మకర్తల మండలి కి సహకరించాలని కోరారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణన లోకి తీసుకుని అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖ ల పరిధిలో అవసరమైన వసతులు కల్పించాలని సేవలు అందించాలని కోరారు. పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలి చైర్మన్ కోరారు.సమన్వయ సమీక్ష సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి పాతకోట కృష్ణవేణి, సింగరాయకొండ తహసీల్దార్ ఎన్ వి బి రాజేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎం డి ఓ జయమణి, వైద్య అధికారి డా వంశీధర్,ఎస్సై సుధీర్ కుమార్,విద్యుత్ అధికారి సాంబశివ రావు,ఆలయ అర్చకుడు ఉదయగిరి శేష లక్ష్మి నారసింహ చార్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శి, దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు సిబ్బంది స్వామి దర్శనం చేసుకున్నారు.
