తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్లు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులు మరియు వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కట్టుదిట్టమైన నిఘా కొనసాగించారు.అదేవిధంగా ప్రయాణికులకు తమ సామాన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్లలో జరిగే చోరీలు, మోసాలు మరియు ఇతర నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం పహారా, తనిఖీలు మరియు నిఘా చర్యలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.