నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఆధ్వర్యంలో కందుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం సాయంత్రం పరిశీలించారు.
మున్సిపల్ కమిషనర్ అనూష, ఇంజనీరింగ్ అధికారులు, టిడిపి నాయకులతో కలిసి సుమారు 3 గంటలసేపు పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న సిసి రోడ్లు, రోడ్ల వెడల్పు పనులను పరిశీలించారు. ఆర్టీసీడిపో, వినాయకుడి గుడి, అభ్యుదయ పాఠశాల, పాతబ్యాంకు బజార్, త్యాగరాజస్వామి గుడి, కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద జరుగుతున్న పనులను దగ్గరుండి పరిశీలిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే పూర్తయిన సీసీ రోడ్లను కూడా చూశారు. కాంట్రాక్టు ప్రకారం పనులు వేగంగా పూర్తి చేయించాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
పాత బైపాస్ రోడ్డు గురించి…ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుంచి అంకమ్మ దేవాలయం వరకు పాత బైపాస్ రోడ్డు ను అభివృద్ధి చేయబోతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. రోడ్ల వెడల్పుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామన్నారు. రోడ్డుకు తూర్పువైపు కాలువపై స్లాబ్ వేసి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మార్చుతున్నట్లు తెలిపారు. పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, పార్టీ నాయకులు రాయపాటి శ్రీనివాసరావు, కొత్తూరి వెంకట సుధాకర్, మురారిశెట్టి శ్రీకాంత్, గొంది నర్సింగరావు, వడ్డెళ్ళ రవిచంద్ర తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *