తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ప్రకాశంజిల్లా దర్శిలో శుక్రవారం డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోమ్ మినిస్టర్ ను స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, కార్యకర్తలు ఘనంగా ఆహ్వానించారు. విగ్రహావిష్కరణ అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో హోమ్ మినిస్టర్ మాట్లాడారు. అనంతరం కనిగిరిలో జరిగే కార్యక్రమాలకు ఆమె వెళ్లారు.