తొలి శుభోదయం న్యూస్ కంభం:-

జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సద్దాం క్లినిక్ నందు శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి అనే గోడపత్రికను ఆవిష్కరించడం జరిగినది. జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యం అన్నారు. అధ్యక్షులు వరికుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మూఢనమ్మకాల నిర్మూలనలో జన విజ్ఞాన వేదిక పాత్ర ఎనలేనిది అని అన్నారు. ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ మానవుడు రాతియుగం నుండి రాకెట్ యుగానికి చేరడానికి మానవులు చేసిన శాస్త్రీయ పరిశోధనలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి షేక్ మస్తాన్ ,ఉపాధ్యక్షులు ఎస్ తిరుమలనాద్, డి నాగేంద్రుడు మరియు సభ్యులు పోస్టల్ వెంకటేశ్వర్లు, కరిమున్నిషా, ఆశ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *