తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :-
గుడ్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సున్నా నుండి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించేందుకు AI ఆధారిత స్క్రీనింగ్ విధానం పై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది ఈ కార్యక్రమానికి గుడ్లూరు పిహెచ్సి వైద్యాధికారి రమ్య రెడ్డి గారు మాట్లాడుతూ సున్నా నుండి మూడు సంవత్సరాల్లో పిల్లల్లో మెదడు 80 శాతం ఎక్కువగా పెరుగుతుందని తెలియజేశారు ఈ వయసులో పిల్లలు తగిన ఎదుగుదల లేకపోతే తల్లులు ఎలా గుర్తించాలి పిల్లలకి ఏ ఏ రకాలు వ్యాధులు వస్తాయో ఆ వ్యాధులని ఎలా గుర్తించాలి అని కార్యకర్తలకు వివరించి చెప్పారు అలాగే సూపర్వైజర్స్ మాట్లాడుతూ ఈ సున్నా నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలు యాప్లో ఎలా గుర్తించాలి వాళ్ళ అభివృద్ధిని తల్లికి ఎలా వివరించాలి ఆ బిడ్డ వయసుకు తగ్గట్టుగా ఎదుగుతుందా లేదా అని బిడ్డని స్క్రీనింగ్ చేసే ఫిదా విధానాన్ని తెలియజేశారు 0 నుంచి మూడు సంవత్సరాల్లో ఒక బిడ్డలు ఎక్కువగా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వారు వయసుకు తగ్గగా ఎదుగుతున్నారో లేదో గృహ సందర్శనాలు చేసి ఆ బిడ్డ పరిస్థితిని ఆ యాప్ లో గుర్తించాలి అని తెలియజేశారు ఆ యాప్ లో గుర్తించిన బిడ్డలు ఏమైనా అభివృద్ధి లోపాలు జరిగి ఉంటే ఆ సమస్యలని పరిష్కరించడానికి డాక్టర్ గారు సలహాలు తీసుకొని వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుందని తెలియజేశారు