తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ మరియు ప్రజల భద్రత లక్ష్యంగా ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో దొనకొండ మండలంలోని బేతలపురం ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే సరైన పత్రాలు లేని వాహనాలపై తనిఖీలు నిర్వహించి, వాహన రికార్డులను పరిశీలించారు.అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, యువత మరియు గ్రామస్తులకు డ్రగ్స్, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, యువత మరియు ప్రజలతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని సంకల్పం చేయించారు.