టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు 2026 -27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థినీ విద్యార్థుల నుండి
దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ ఎం. రవి కుమార్ తెలియజేశారు. తమ కళాశాలలో బీఎస్సీ విభాగంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ లలో మేజర్ కోర్సులు, జూవాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ లలో మైనర్ కోర్సులు; బిఏ విభాగంలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఇంగ్లీష్ మేజర్ కోర్సులు, హిస్టరీ , స్పెషల్ తెలుగులలో మైనర్ కోర్సులు;బీకాం విభాగంలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు ఉపాధి ఆధారిత బి ఎఫ్ ఎస్ ఐ (బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్ & ఇన్సూరెన్స్) మేజర్ కోర్సులు ఉన్నాయని తెలియజేశారు. తమ కళాశాలలో నెట్, స్లెట్, పీహెచ్డీ చేసి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన, ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులతో అత్యున్నత విద్యాబోధన అందించబడుతుందని తెలిపారు. అత్యుత్తమమైన సైన్స్ ల్యాబ్స్, క్షేత్ర పరిశీలనకు అవకాశం ఉన్న 5 ఉద్యానవనాలు, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా బోధన తమ కళాశాల ప్రత్యేకతలని ప్రిన్సిపాల్ ప్రకటించారు. 40 వేల పుస్తకాలతో, డిజిటల్ సౌకర్యాలు గల అధునాతన లైబ్రరీ, విశాలమైన క్రీడా మైదానం, విద్యార్థిని మరియు విద్యార్థులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి, పోటీ పరీక్షలకు మరియు ఉన్నత విద్య ఎంట్రన్స్ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయడం తమ కళాశాలలో నిరంతర ప్రక్రియలని ప్రిన్సిపాల్ తెలియజేశారు. న్యాక్ A ప్లస్ గ్రేడింగు సాధించి, అటానమస్ ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు పొంది, రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తీ చేసుకొని, అన్ని సబ్జెక్టులలో 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి, మూడో సంవత్సరంలో అడుగిడుతున్నదని తెలిపారు.ఈ విద్యా సంవత్సరం నుండి కళాశాలలో NCC యూనిట్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలియజేశారు.కావున కందుకూరు మరియు పరిసర ప్రాంత విద్యార్థినీ విద్యార్థులు టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అడ్మిషన్ పొంది తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *