అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు గంగాదేవపల్లి గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,100 నగదు మరియు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు వ్యక్తులు, కుటుంబాలు మరియు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *