ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు రాత్రి వేళల్లో జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, వాణిజ్య కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు మరియు నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను తనిఖీ చేసి విచారిస్తున్నారు. నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.అదేవిధంగా రాత్రి సమయంలో దొంగతనాలు, చోరీలు, అసాంఘిక కార్యకలాపాలు మరియు ఇతర చట్టవ్యతిరేక చర్యలను అరికట్టేందుకు వాహన తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానితుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *