స్థానిక ఎంఈవో కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో డిఈవో సామా సుబ్బారావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలతో పాటు, ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన కంభం చెఱువు కట్టపై ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని,శారీరక మానసిక సంసిద్ధతకు యోగా ఉపయుక్తంగా ఉంటుందని అంటూ, యోగా దినోత్సవాన్ని ఒక సామూహిక ఉద్యమంలా జరపాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఈవో కోరారు.ఈ సందర్భంగా
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.అనంతరం డిఈఓను ఉపాధ్యాయ సంఘాల నాయకులు అందరూ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డివైఈవో, కంభం బెస్తవారిపేట,అర్థవీడు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాలు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *