ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణలో భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు సైబర్ మోసాలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రత, పోక్సో చట్టం, హెల్మెట్ వినియోగం మరియు నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సైబర్ నేరగాళ్లు OTPలు, బ్యాంకు ఖాతా వివరాలు, KYC అప్‌డేట్‌లు, ఫేక్ లింకులు మరియు సోషల్ మీడియా మోసాల ద్వారా ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTPలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోకూడదని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.అదేవిధంగా గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. మహిళలపై నేరాల నివారణ, మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, పోక్సో చట్టం ద్వారా చిన్నారుల రక్షణకు ఉన్న చట్టపరమైన నిబంధనలను వివరించారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. నేరాల నివారణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *