ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. పుల్లలచెరువు. పోలీస్ స్టేషన్ ఎస్సై గారు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను ఒకటి ట్రేస్ చేసి, సంబంధిత యజమానికి అందజేశారు.అదేవిధంగా దొనకొండ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు రుద్రసముద్రం గ్రామంలో అనుమానితుల వద్ద నుంచి రెండు దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిని వారి నిజమైన యజమానులకు అప్పగించారు.మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వాటిని గుర్తించే అవకాశం పెరుగుతుందని పోలీసులు తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణ, పోయిన వస్తువుల రికవరీ విషయంలో ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *