టంగుటూరు మండలం లోని 56 ప్రభుత్వ పాఠశాలలకు సర్వేపల్లి రాధా కృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందజేసినట్లు మండల విద్యాధికారి 2 తన్నీరు బాలాజీ తెలిపారు. జూన్ 12 న పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా పునః ప్రారంభానికి ముందే 3239 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, నిఘంటువులు, యూనిఫాం, బెల్టులు ZPHS MARLAPADU కేంద్రం నుండి పంపిణీ చేసినట్లు బాలాజీ తెలిపారు. పాఠశాలలు ప్రారంభం కాగానే ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలని ఆయన కోరారు. మండలం లో 13 ఉన్నత పాఠశాలలు, 43 ప్రాథమిక పాఠశాలలకు ఈ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశామని, అన్ని సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యనందిస్తున్నామని, కావున తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగరు భవితకు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు చలపతి రావు, అన్నపూర్ణ, MEO ఆఫీసు సిబ్బంది వేణు, బాలకృష్ణ, శ్రీనివాస్, శ్రీహరిబాబు, శ్రీనివాసాచారి, జోషి, సుబ్బులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *