ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు సింగరాయకొండ సిఐ శ్రీహరి గారి పర్యవేక్షణలో టంగుటూరు యస్.ఐ వి. నాగమల్లేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు టంగుటూరు యస్.ఐ వి. నాగమల్లేశ్వరరావు మరియు సిబ్బంది కలిసి
మర్లపాడు గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో, ఈరోజు టంగుటూరు యస్.ఐ వి. నాగమల్లేశ్వరరావు, తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి (రైడ్) నిర్వహించారు.
ఈ దాడిలో పేకాటలో పాల్గొంటున్న 4 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి మొత్తం రూ. 2410/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు నమోదు చేయబడింది.
అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ప్రజలు ఇటువంటి చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *