ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీర ప్రాంతంలో అధికారికంగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర అవగాహన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ముందుగా నిర్వాహకులు ఒంగోలు ఆర్ డి ఒ బీచ్ కి వచ్చిన జిల్లా కలెక్టర్ రాజ బాబు, సంతనూతల పాడు శాసన సభ్యుడు బి ఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పన రాణి,గ్రామ పంచాయతీ సర్పంచ్ సైకం చంద్ర శేఖర్ లకు నిర్వాహకులు,సాదరంగా స్వాగతం పలికారు. అతిథుల రాకతో నిర్వాహకులు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగ కి ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి పౌరుడిని భాగస్వాములు చెయ్యాలని చేపట్టిన కార్యక్రమం ప్రజల నిత్య యోగ సాధన జీవన శైలిలో భాగం కావాలని పిలుపు ఇచ్చారు. సంతనూతల పాడు శాసన సభ్యుడు బి ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం సంపద అన్న ఆర్యోక్తి అర్థం మూలం మనసు శరీరం చర్మం అన్నారు.రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ మానసిక శారీరక దృఢత్వం తో పాటు ప్రశాంత జీవనానికి దోహద పడుతుందన్నారు. ఆరోగ్య వంతం ఆయన జీవితానికి యోగ ఒక ఆయుధం వంటిదన్నారు. సింగరాయకొండ మండలం ఇతర ప్రాంతాల నుండి ఉద్యోగులు, ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థులు, అంగన్వాడీ, పొడుపు, ఉపాధి హామీ మహిళలను భారీగా తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు ,అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన విధంగా యోగాంధ్ర కార్యక్రమం లో పతంజలి యోగ నిర్వాహకులు , యోగ కార్యకర్తలు యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా డివిజనల్ అధికారులు, స్థానిక ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *