కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండల కేంద్రంలో ఈనెల 12వ తేదీన ‘ మీకోసం ‘ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నెలలో ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో ‘మీకోసం ‘ కార్యక్రమం నిర్వహించాలన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసియున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లింగసముద్రం తహసిల్దార్ కార్యాలయంలో ‘ మీకోసం ‘ కార్యక్రమం జరుగుతుంది.
చినపవని లో పల్లెనిద్ర
ఈనెల 11వ తేదీ గురువారం రాత్రి లింగసముద్రం మండలంలోని చినపవని గ్రామంలో జిల్లా కలెక్టర్ ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమం ఉంటుంది. గ్రామస్తులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. రాత్రికి చినపవని గ్రామంలోనే బస చేసి శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటిస్తారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయికి వస్తున్న దృష్ట్యా ఈ కార్యక్రమాల ద్వారా తమ సమస్యలను ప్రజలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *