తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక విప్పగుంట రోడ్డులో నివాసం ఉంటున్న చిన్నారులు, అనాధలు, ఒంటరి వృద్ధులు, దివ్యాంగులు, ఆకలితో ఉన్న పేదలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న చింతా బత్తిన స్నేహిక తన తల్లి శైలజ ప్రతిరోజు ఇచ్చిన పాకెట్ మనీ ని కొంత కాలంగా పొదుపు చేసుకున్న విద్యార్థిని ఆ మొత్తంతో భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ అవసరమైన వారికి భోజనం, వాటర్ బాటిల్స్ అందించడం అభినందనీయం అన్నారు. చిన్న చేతులు చేసిన ఈ చిన్న సహాయం ఎన్నో పెద్ద హృదయాలకు స్ఫూర్తినిస్తుంది. సంపద ఎంత ఉన్నదన్నది కాదు ఇతరుల బాధను ఎంత అర్థం చేసుకున్నామన్నదే గొప్ప ధనము అని ఈ చిన్నారి తన ఆచరణ ద్వారా నిరూపించింది అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, ప్రేమ్ బాబు, మైత్రెష్, చరణ్ తేజ, శివ, చందన్ తదితరులు పాల్గొన్నారు.