google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-

నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నాను.ఈ సమావేశానికి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మొగిలి వెంకటేశ్వర్లు గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన జెడ్పీ నిధులను కేటాయించాలని కోరాను. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, స్మశానవాటికల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో విజ్ఞప్తి చేశాను.ప్రజల అవసరాలకు అనుగుణంగా కోవూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *