google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) అవగాహన కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ మరియు యూనిట్ ఇంచార్జిలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA), మండల ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నాను. ఈ నెల 15వ తేదీ నుంచి SIR కార్యక్రమం ప్రారంభం కానుందని, క్షేత్రస్థాయిలో ప్రతి నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండి బాధ్యతతో పనిచేయాలని సూచించాను. బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే పరిస్థితులు, ఓటరు ధృవీకరణ విధానం, కుటుంబ లింకేజీల పరిశీలన, డ్రాఫ్ట్ ఓటరు జాబితా పరిశీలన, అభ్యంతరాల నమోదు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్ర అవగాహన కల్పించాను.ప్రతి 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం సాధారణ ప్రక్రియ అని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నాను. జూలై 14వ తేదీలోపు రెండు దఫాలుగా ఓట్ల మ్యాపింగ్ జరుగుతుందని, అనంతరం జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాల్సి ఉంటుందని వివరించాను.ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *