google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల ఎంపీపీ స్కూల్ (ఎస్సి) పాలెం లో సెక్టార్ సూపర్వైజర్ లక్ష్మీదేవి మరియు ఐటిసి ప్రథమ్ డిస్టిక్ కో ఆర్డినేటర్ వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దోర్నాల
ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు సి.డి.పి.ఓ ఏ. లక్ష్మీబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సి.డి.పి.ఓ మాట్లాడుతూ అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ఎలిమెంటరీ స్కూల్ కి వెళ్లబోతున్న పిల్లలకు అభివృద్ధిల వారీగా తల్లిదండ్రుల సమక్షంలో అసెస్మెంట్ నిర్వహించి వారి యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. ప్రీస్కూల్ పిల్లల తల్లులు వారి పిల్లల్ని నమోదు స్టాల్ దగ్గర నమోదు చేసుకుని శారీరక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మేధావివృద్ది, గణిత అభివృద్ధి, మరియు భాషాభివృద్ధి స్టాల్స్ దగ్గరకి పిల్లల్ని తీసుకువెళ్లి యాక్టివిటీస్ అన్ని పిల్లలతో చేయించుకొని వారి యొక్క ప్రగతి స్థాయిలను గమనించారన్నారు. ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకట్రావు మాట్లాడుతూ పాఠశాల సంసిద్ధత మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఆట పాటల ఆధారిత కార్యకలాపాల ద్వారా పిల్లల అభివృద్ధిని తల్లిదండ్రుల సమక్షంలో అంచనా వేసి వారి యొక్క అభివృద్ధి స్థాయిలను గురించి తల్లిదండ్రులు అవగాహన పెంపొందించడం మరియు పిల్లలను పాఠశాలకు సమగ్ర అభివృద్ధిలో సంసిద్ధులను చేయడం. పిల్లలను పాఠశాలలకు సిద్ధం చేయడంలో తల్లిదండ్రులు సంరక్షకులు ముఖ్యంగా తల్లులను భాగస్వాములను చేయడం పిల్లల స్థాయిలను మరియు వారి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తగిన సహాయం చేయించడం అని అన్నారు. అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని సి.డి.పి.ఒ ఏ లక్ష్మీబాయి, ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సోమా వెంకట్రావు మరియు సూపర్వైజర్ లక్ష్మీదేవి చేతుల మీదుగా పిల్లలందరికీ ప్రగతి పత్రాలను అందించారు. అనంతరం అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా 3-6 సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీలో మాత్రమే నమోదు చేసుకోవాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోర్నాల ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు సి.డి.పి.ఓ ఏ లక్ష్మీబాయి, ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సోమా వెంకట్రావు, సూపర్వైజర్ లక్ష్మీదేవి, ఎఫ్.ఎల్.ఎన్ కోఆర్డినేటర్ ఎం. సుబ్బారావు, అంగన్వాడీ టీచర్లు, ఆషా, ఆయాలు మరియు ప్రీస్కూల్ తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *