google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా త్రిపురాంతకం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా ట్రేస్ చేసి రికవరీ చేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్ ఆచూకీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను దాని నిజమైన యజమానికి అప్పగించి బాధితుడికి ఊరటనిచ్చారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా సంబంధిత పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ప్రజల ఆస్తుల రక్షణ, పోగొట్టుకున్న వస్తువుల రికవరీ విషయంలో మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *