తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :-
దోర్నాల ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు పరిధిలో గల పెద్దారవీడు మరియు ఎస్ కొత్తపల్లి అంగన్వాడి కేంద్రాల్లో అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం సెక్టార్ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ ఏ. లక్ష్మీబాయి మరియు ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సోమా వెంకట్రావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా శిశు సంక్షేమ శాఖ ద్వారా రిమోట్ లర్నింగ్ మెసేజ్ ల ద్వారా యూనిఫామ్ గా ప్రీ ప్రైమరీ విద్యా విధానం అన్ని అంగన్వాడీలలో అమలు చేస్తున్నారు. మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల్లో 85% మేధావివృద్ది జరుగుతుంది. అంగన్వాడీలో పిల్లలకు ప్రభుత్వము ద్వారా ఉచిత పార్టీ పుస్తకాలు మరియు మెటీరియల్ ఉపయోగిస్తూ పిల్లల్లో శారీరక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మేధావిధి, గణిత అభివృద్ధి, భాషాభివృద్ధి, జరిగేలా పూర్వ ప్రాథమిక విద్య అందించడం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లల ప్రగతిని అంచనా వేసి వారి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే విద్య పిల్లల యొక్క మెదడు అభివృద్ధి మరియు ఆలోచన శక్తిను మెరుగు పరుస్తాయన్నారు. ఈ వయసులో పిల్లలకి ఆటపాటల ద్వారా బలమైన మరియు పిల్లల భవిష్యత్తుకు అవసరమైన పునాది కేవలం అంగన్వాడీల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అంగన్వాడీ పీలుస్తుంది అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోర్నాల ఐ.సి.డి ఎస్ సి.డి.పి.ఓ ఏ. లక్ష్మీబాయి మరియు ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సోమా వెంకట్రావు, సూపర్వైజర్లు ఎన్. అంజమ్మ, ఎం. లక్ష్మీదేవి మరియు అంగన్వాడీ కార్యకర్తలు ప్రీస్కూల్ తల్లులు తదితరులు పాల్గొన్నారు…..