తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు జె.పంగులూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన వివిధ కేసులు, యూఐ (UI) పెండెన్సీ, దర్యాప్తు పురోగతి మరియు పెండింగ్ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అలాగే ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో చట్టపరంగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సూచించారు.స్టేషన్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి విధుల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలు మరియు పనితీరుపై చర్చించి అవసరమైన సూచనలు అందించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలని తెలిపారు.