ఆయన మృతికి సంతాపం శ్రద్ధాంజలి.
తొలి శుభోదయం సింగరాయకొండ/ ఒంగోలు,:-
పోలీస్ శాఖకి వివిధ హోదాలు, వివిధ సంచలన కేసుల లో తన కంటూ ప్రత్యేక స్థానం సాధించిన ప్రజా పోలీస్ వేలమూరి శ్రీ రామ్ మృతి సమాజానికి, పోలీస్ శాఖ కి తీరని లోటు అని జాతీయ పరశురామ సేవాసమితి జాతీయ గౌరవ అధ్యక్షుడు బిఎన్ డా. పెట్లూరి వేంకటేశ్వర రావు కొనియాడారు. పరశురామ సేవాసమితి ద్వారా ఆయన పలు సేవాకార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించారని ఆయన సేవా తత్వం గోప్యంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. శ్రీరామ్ కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన సమాచారం కలత చెందించిందన్నారు. సమాజం గుర్తుంచుకోవాల్సిన పోలీస్ అధికారిగా ఆయన ప్రజలకు గుర్తు చేశారు.ఆయన మృతికి జాతీయ పరశురామ సేవాసమితి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది.