google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రజలను వేధిస్తూ వారి నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడినా అలాంటి చర్యలలో భాగస్వాములైన వారి పై కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ సిఐ శ్రీహరి హెచ్చరించారు. శుక్రవారం తన కార్యాలయం లో కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలం లో కొందరు ఆచారాల పేరుతోనో, మరోరకంగా నో ప్రజలనుండి బలంతపు వసూళ్లకు పాల్పడి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆర్థికంగా అధిక మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపద్యం లో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసు నమోదు అయిందన్నారు. ఆమేరకు విచారించి దానికి సంబంధించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన 27 మంది పై కేసు నమోదు చేసి కోర్టుకు పంపడం జరిగిందన్నారు. అంతే కాకుండా మరో 37 మంది పై బైడోవర్ కేసు నమోదు చేసి సింగరాయకొండ తహసీల్దార్ ఎదుట హాజరు పెట్టడం జరుగుతుందన్నారు. సింగరాయకొండ సర్కిల్ పరిధిలో ఎక్కడైనా ఎవరైనా ప్రజలను బెదిరించి ఆచారాల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడితే అలాంటి వారి పై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్కిల్ పరిధిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలు పోలీస్ కి సహకరించాలని సి ఐ శ్రీహరి కోరారు. ప్రజలకు శాంతి భద్రతల పరిరక్షణ, తక్షణ రక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరాల నియంత్రణ, ఆకతాయిల, బెట్టింగ్ రాయుళ్ళ కదలికలు గుర్తించేందుకు, అలాంటి వారిని అరికటెందుకు ప్రజలు పోలీస్ లకు సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా సింగరాయకొండ ఎస్సై సుధీర్ కుమార్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *