తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, గౌరవ కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనల మేరకు ఈ ఉదయం కందుకూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం, అక్కడి నుండి డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు మరియు స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వందల సంఖ్యలో తరలివచ్చి కూటమి ప్రభుత్వానికి తమ మద్దతును తెలియజేశారు.ఈ ర్యాలీలో మూడు పార్టీలకు సంబంధించిన పట్టణ, మండల, వార్డు, గ్రామ పార్టీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల సభ్యులు మరియు ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.