google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ప్రకాశం జిల్లా దర్శి సబ్‌డివిజన్ పోలీసులు బల్లికురువ మండలం కుకుట్లపల్లి సంఘం గ్రామంలో ప్రత్యేక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారి పర్యవేక్షణలో, సంతమాగులూరు సీఐ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో సంతమాగులూరు , అద్దంకి టౌన్, దర్శి టౌన్ సీఐలు, బల్లికురువ, మేదరమెట్ల, జె.పంగులూరు, కొరిశపాడు ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.తనిఖీల సందర్భంగా పత్రాలు లేని 87 మోటార్ సైకిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమైన దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ మోసాల నివారణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ప్రజల సహకారంతో నేర రహిత సమాజ నిర్మాణానికి పోలీసులు కట్టుబడి ఉన్నారని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *