తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం మండల పరిధిలోని వేములకోట గ్రామం నందు వైయస్సార్సీపి యువత ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే,నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకే వెంకటరెడ్డి ఆదివారం న బహుమతులను అందజేశారు..ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడలకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు..తద్వారా క్రీడలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతతకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు..ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైయస్ఆర్సీపీ యువతను జంకె వెంకటరెడ్డి అభినందించారు.వేములకోట వైఎస్ఆర్సిపి యువత ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం,తద్వారా యువతను క్రీడల్లో ప్రోత్సహించడం మంచి శుభ పరిణామం అని అయన వెల్లడించారు.వైసిపి ప్రభుత్వం హయాంలో క్రీడలకు ప్రముఖ స్థానం కల్పించారని తెలిపారు..గ్రామాలలో ఉండే యువతను క్రీడలలో ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించి క్రీడలలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఘనత వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి చెందుతుందని కొనియాడారు..ఇదే స్పూర్తితో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సిపి యువత తిరిగి మరల వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకొనుటకు కంకణ బద్దులై పని చేయాలని కోరారు..వైసిపి ప్రభుత్వ హయాంలో పేదలు,బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు గుర్తుచేయాలని వెల్లడించారు..వైయస్ జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు..వైసిపి నాయకులు,కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మరల ముఖ్యమంత్రి చేసుకొనుటకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధర్మ నాయక్, సయ్యద్ గౌస్ మోహిద్దీన్, సాంభ, శివారెడ్డి, పంభీ వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి తదితర వైసీపీ నాయకులు,కార్యకర్తలు క్రీడాకారులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..