google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రకాశం జిల్లా కందుకూరు డిఎస్పీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 15వ తేదీ (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసి అందజేయాలని సూచించారు.ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *