google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, ఊళ్లపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం మరియు భారీ ర్యాలీ ఘనంగా జరిగింది.మనోజ్ రాయల్, పిల్లిపోగు పీటర్ బాబు, బడుగు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 200 మందికి పైగా జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సాధకులు, ఉద్యములు మరియు యువత పాల్గొని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఊళ్లపాలెం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా, జనసేన పార్టీ జెండాలు , నినాదాలతో గ్రామం మారుమోగింది.ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సాధకులు, ఉద్యములు, యువత మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుండి పార్టీ విస్తరణ, యువతకు అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రతి మండలం – ప్రతి పంచాయతీ – ప్రతి గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే కొండేపి నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేసే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలని సంకల్పం వ్యక్తం చేశారు.అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన కొత్తవారికి, యువతకు మరియు Gen-Z తరానికి అవకాశాలు కల్పించి పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, సాధకులు, ఉద్యములు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *