google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుబోదయం న్యూస్ మార్కాపురం :-

మార్కాపురం జిల్లా పరిధిలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యంత్రాంగం సభా స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా సభా వేదిక ఏర్పాటు, ప్రజల కోసం కల్పించాల్సిన సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *