google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గిద్దలూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో, నాలెడ్జ్ పార్ట్నర్‌గా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం సామర్థ్య వృద్ధి (Capacity Building) మరియు నైపుణ్యాభివృద్ధి (Skill Development) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ శ్రీ ఈ.వి. రమణ బాబు హాజరై మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఆరోగ్య భద్రత, పని నైపుణ్యాల పెంపు, ఆధునిక పారిశుధ్య పద్ధతులపై అవగాహన పెంచడం ద్వారా మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని తెలిపారు. స్వచ్ఛత లక్ష్యాల సాధనలో ప్రతి పారిశుధ్య కార్మికుడి పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.ఈ సందర్భంగా AIILSG రిసోర్స్ పర్సన్ శ్రీ దత్తం కోటేశ్వరరావు పారిశుధ్య నిర్వహణలో అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు, వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) వినియోగం, వ్యర్థాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు మరియు ఉద్యోగ నైపుణ్యాల అభివృద్ధి అంశాలపై సమగ్రంగా శిక్షణ అందించారు.శిక్షణ కార్యక్రమం నిర్వహణలో AIILSG బృంద సభ్యులు శ్రీ నిఖిల్, శ్రీ విశ్వనాథ్ మరియు శ్రీ మల్లికార్జున పాల్గొని వివిధ అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న పారిశుధ్య కార్మికులు శిక్షణ ద్వారా తమ పనితీరు మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడే విలువైన సమాచారం అందిందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమం ద్వారా పారిశుధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించి, గిద్దలూరు పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *