google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మహిళలు, బాలికల భద్రత మరియు చిన్నారుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలకు శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా పోలీసుల సహాయం ఎలా పొందవచ్చో వివరించారు. అనంతరం శక్తి యాప్‌ను వారి మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేయించి వినియోగ విధానాన్ని తెలియజేశారు.అలాగే చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించి, తమకు అసౌకర్యంగా అనిపించే లేదా అనుచితంగా ప్రవర్తించే వ్యక్తుల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *