google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

గ్రామ రాజ్య అభివృద్ధి మౌలిక వసతుల కల్పన,ప్రగతి సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చి చేపట్టే పనులు అమలు చేయాలంటే దానికి మండల పరిషత్, గ్రామ రాజ్యాల కేంద్రంగా జరగాలి. అయితే అభివృద్ధి కార్యక్రమాల అమలు కి ప్రభుత్వం చేపట్టిన మండల పరిషత్ వ్యవస్థ కి కీలకం ప్రజాప్రతినిధులు. అయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం లో పూర్తిగా రాజకీయ ప్రాధాన్యత కారణంగా మండల పరిషత్ వ్యవస్థ లో అభివృద్ధి కుంటు పడుతుంది. సింగరాయకొండ మండల పరిషత్ లో ప్రజా ప్రతినిధులు వై ఎస్ ఆర్ సి పి కి చెందిన వారు కావడం తో మండల పరిషత్ సాధారణ సమావేశానికి హాజరు కాక వాయదా పడుతూ వచ్చాయి. బుధవారం సమావేశానికి ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడం తో గురువారానికి వాయదా పడింది. మండల పరిషత్ సాధారణ సమావేశం ప్రకటించిన విధంగా 11 గంటలకి ప్రారంభం కావాల్సి ఉండగా 12 గంటలకు మండల పరిషత్ అధ్యక్షురాలు కట్టా శోభారాణి, ఎం పి డి వో జయ మణి సమావేశ మందిరానికి చేరుకుని ప్రజా ప్రతినిధులు హాజరు కాక పోవడం తో ఎం పి పి సమావేశాన్ని వాయదా వేశారు. మండల సాధారణ సమావేశానికి మండల పరిషత్ ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ ల ప్రత్యేక అధికారులు, హాజరు కాక పోగా వివిధ శాఖల అధికారుల, ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *