తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో 92 మంది లబ్ధిదారులకు రూ.95.82 లక్షలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
రెండేళ్ల కూటమి పాలనలో కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1856 మందికి 15.25 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశాం. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. పేదల విద్య, వైద్యం ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పి 4 తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పేదలకు మేలు చేస్తుంటే..వైసీపీ ఓర్వలేక రాష్ట్రంలో శవ, కుల రాజకీయాలు చేస్తోంది. వైసీపీ ఓ విషవృక్షం, ప్రజలు దాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి, లేకుంటే రాష్ట్రానికి ప్రమాదకరమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.